Amit Sha: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా సవాల్..

సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు.

సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలి.. తెలంగాణ నుంచి 12కి పైగా స్థానాలు గెలిపించాలని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు అని అమిత్ షా చెప్పారు.

 

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయి.. ఆ రెండు పార్టీలతో నిజాం పాలన విముక్త తెలంగాణ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాంగ్రెస్.. కేసీఆర్, కేటీఆర్ ల పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. దేశంలో అన్నివర్గాల ప్రజల పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని మండిపడ్డారు. 2జీ స్కాం, భోఫార్స్ కుంభకోణం ఇలా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం మొదలు ఎన్నో అవినీతి చేశారు.. కవితకు లిక్కర్ స్కాంలో ఆరోపణలున్నాయని తెలిపారు.

 

ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని అమిత్ షా పేర్కొన్నారు. దేశం మోడీ పాలనలో సురక్షంగా ఉంది.. పాకిస్తాన్ ఆటలు మోడీ సాగనివ్వలేదని అన్నారు. CAA తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు సిటిజన్ షిప్ మోడీ సర్కారు ఇస్తోందని తెలిపారు. దేశ విద్రోహ శక్తులకు తప్ప CAA ఎవరికి వ్యతిరేకం కాదు.. CAA సామాన్య శరణార్థులకు వ్యతిరేకం కాదు అని అన్నారు. తెలంగాణ అభివృద్ది కేవలం మోడీ సర్కారుతో సాధ్యం అని తెలిపారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీని పీఎం చేయాలని.. కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయాలని లక్ష్యం అని అమిత్ షా తెలిపారు. దేశంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనని అన్నారు. మోడీ సర్కారు మాత్రం భారత కుటుంబ కోసం అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో మోడీకి దక్కుతున్న అపూర్వ స్వాగతం మోడీది కాదు.. యావత్ భారత ప్రజలకు దక్కుతున్న గౌరవం అని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ ను మూడో అగ్ర దేశంగా నిలపడమే మోడీ లక్ష్యం అని అమిత్ షా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !