రైతులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో రైతుబంధు నిధులు విడుదలకు క్యాబినెట్ ఆమోదం

తెలంగాణలో కాంగ్రెస్ (Congress)ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు..మరికొన్నింటిని అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది.

ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు(White Ration Cards) లేని వారికి వంద రోజుల్లో కొత్త కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అదే విధంగా మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం( Indiramma Houses)పై త్వరలో జీవో ఇవ్వనుంది. పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.22,500 కోట్లు కేటాయించనుంది. 16 బీసీ కార్పోరేషన్‌(BC Corporations)ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పోరేషన్ పునరుద్ధరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయించింది. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు ఇవ్వనున్నట్లుగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

క్యాబినెట్ లో కీలత తీర్మానాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్న ప్రభుత్వం..మరికొన్నింటిని అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. ఇందులో బాగంగానే తెల్ల రేషన్ కార్డులు లేని వారికి వంద రోజుల్లో కొత్త కార్డులు మంజూరు చేయనుంది. అదే విధంగా మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది. మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయింపు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

రెండ్రోజుల్లో రైతుబంధు నిధులు విడుదల..

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో విడుదల చేయనుంది. పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.22,500 కోట్లు కేటాయించనుంది. 16 బీసీ కార్పోరేషన్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేయడం ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని భావించింది. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లుగా మంత్రులు తెలిపారు.

బీసీ కార్పొరేషన్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు..

హౌసింగ్ కార్పోరేషన్ పునరుద్ధరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయించింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేయనుంది.రాష్ట్రంలోని లబ్దిదారులకు రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు ఇవ్వనున్నట్లుగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించలేక విమర్శలు చేస్తోందని ..లేని పోని అపోహలను సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేయాలని చూస్తోందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !