ఈసీ వద్దకు ఎలక్టోరల్ బాండ్స్ డేటా – సుప్రీంకోర్టు గడువులోపు ఇచ్చిన SBI

bahubalamtv Reporter
bahubalamtv.in

ఈసీ వద్దకు ఎలక్టోరల్ బాండ్స్ డేటా – సుప్రీంకోర్టు గడువులోపు ఇచ్చిన SBI

దేశంలోని పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన వివరాలు అన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి అందించింది.

సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి నేడు (మార్చి 12) సాయంత్రం 5.30 గంటలకు అందించినట్లుగా జాతీయ వార్తా పత్రికలు రాశాయి.

సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 11) ఇచ్చిన తీర్పు ప్రకారం.. అన్ని పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వస్తున్న విరాళాలకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి ఎస్బీఐ మార్చి 12 సాయంత్రంలోగా అందించాలి. తాము ఇచ్చిన గడువులోగా ఈ వివరాలు అందించడంలో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న హెచ్చరించింది. దీన్ని ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించడానికి తమకు సమయం కావాలని, ఆ గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ పిటిషన్ వేయగా.. ధర్మాసనం బ్యాంకు వినతిని తోసిపుచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి 12 నాటికి బిజినెస్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

రాజకీయ పార్టీలకు ఆదాయం వచ్చే మార్గాల్లో ఒకటైన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఇదే ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో భాగంగా.. ఎవరు ఎంత విరాళాన్ని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీకి ఇచ్చారనే వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే వెసులుబాటు కేవలం ఎస్బీఐకు మాత్రమే కల్పించారు.

ఇలా పొలిటికల్ పార్టీలు గోప్యంగా ఫండింగ్ పొందే విధానాన్ని సుప్రీంకోర్టు.. రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. దాతల వివరాలను కచ్చితంగా ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశంలోని ప్రతిపక్ష నాయకులు ప్రశంసించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇచ్చారో త్వరలో దేశానికి తెలుస్తుందని వారు అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !