హుజురాబాద్ మండలం వెంకట్రావు పల్లెలో హోరాహోరీ: బీసీ అభ్యర్థికి మద్దతుగా ఏకమైన బడుగు వర్గాలు

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ మండలం వెంకట్రావు పల్లెలో హోరాహోరీ: బీసీ అభ్యర్థికి మద్దతుగా ఏకమైన బడుగు వర్గాలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, డిసెంబర్ 16:
కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం పరిధిలోని వెంకట్రావు పల్లె గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ కన్నెబోయిన విజేందర్ గారికి మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. 'అగ్రవర్ణాలను ఓడిద్దాం, బీసీ బిడ్డను గెలిపించుకుందాం' అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు. విజేందర్ గారు తమ ఎన్నికల గుర్తు అయిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులు, మద్దతుదారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
గత అభివృద్ధి, నిస్వార్థ సేవలే కీలకం
ప్రచారంలో విజేందర్ గారి మద్దతుదారులు, గతంలో సర్పంచ్‌గా పనిచేసిన వారి భార్య, కీర్తిశేషులు కన్నేబోయిన దేవమ్మగారు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను బలంగా ప్రజలకు వివరిస్తున్నారు. దేవమ్మగారు హయాంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, విద్యాలయ భవనం నిర్మాణం వంటి కీలక పనులు జరిగాయని గుర్తు చేస్తున్నారు. వీటితో పాటు, మిషన్ భగీరథ నల్లాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, చెరువులో పూడిక తీయించడం వంటి మౌలిక వసతుల కల్పనలో ఆమె పాత్ర అమోఘమని పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామంలో కరువు వచ్చినప్పుడు ట్రాక్టర్ వాటర్ ట్యాంకులతో ఇంటింటికీ నీళ్లు పోయించడం వంటి నిస్వార్థ సేవ ఆమె నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని తెలిపారు.
డబ్బుకు, హామీలకు లొంగవద్దు: అభ్యర్థి విజ్ఞప్తి
ఈ సందర్భంగా, అగ్రవర్ణాల ఉచ్చులో పడకుండా, వెనుకబడిన వర్గాల అభ్యర్థిగా ఉన్న విజేందర్ యాదవ్ గారిని గెలిపించుకుంటేనే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన మద్దతుదారులు దృఢంగా చెబుతున్నారు.
వారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "జనరల్ స్థానంలో మన బడుగు బలహీన వర్గాల బిడ్డలను గెలిపించుకుందాం. ఎన్నికల సమయంలో మాత్రమే ఊరికి వచ్చి, డబ్బుకు, మధ్యానికి అమ్ముడుపోవాలని చూసే వ్యక్తులకు లొంగవద్దు," అని గట్టిగా హెచ్చరించారు. ఈరోజు సాధ్యం కాని హామీలు ఇచ్చి, రేపు గ్రామాన్ని దోచుకునే అవకాశం ఉందని, మనతో కలిసి ఉన్న, మన కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవాలని వెంకట్రావు పల్లె ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, డిసెంబర్ 16:
కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం పరిధిలోని వెంకట్రావు పల్లె గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ కన్నెబోయిన విజేందర్ గారికి మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. ‘అగ్రవర్ణాలను ఓడిద్దాం, బీసీ బిడ్డను గెలిపించుకుందాం’ అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు. విజేందర్ గారు తమ ఎన్నికల గుర్తు అయిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులు, మద్దతుదారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
గత అభివృద్ధి, నిస్వార్థ సేవలే కీలకం
ప్రచారంలో విజేందర్ గారి మద్దతుదారులు, గతంలో సర్పంచ్‌గా పనిచేసిన వారి భార్య, కీర్తిశేషులు కన్నేబోయిన దేవమ్మగారు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను బలంగా ప్రజలకు వివరిస్తున్నారు. దేవమ్మగారు హయాంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, విద్యాలయ భవనం నిర్మాణం వంటి కీలక పనులు జరిగాయని గుర్తు చేస్తున్నారు. వీటితో పాటు, మిషన్ భగీరథ నల్లాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, చెరువులో పూడిక తీయించడం వంటి మౌలిక వసతుల కల్పనలో ఆమె పాత్ర అమోఘమని పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామంలో కరువు వచ్చినప్పుడు ట్రాక్టర్ వాటర్ ట్యాంకులతో ఇంటింటికీ నీళ్లు పోయించడం వంటి నిస్వార్థ సేవ ఆమె నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని తెలిపారు.
డబ్బుకు, హామీలకు లొంగవద్దు: అభ్యర్థి విజ్ఞప్తి
ఈ సందర్భంగా, అగ్రవర్ణాల ఉచ్చులో పడకుండా, వెనుకబడిన వర్గాల అభ్యర్థిగా ఉన్న విజేందర్ యాదవ్ గారిని గెలిపించుకుంటేనే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన మద్దతుదారులు దృఢంగా చెబుతున్నారు.
వారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “జనరల్ స్థానంలో మన బడుగు బలహీన వర్గాల బిడ్డలను గెలిపించుకుందాం. ఎన్నికల సమయంలో మాత్రమే ఊరికి వచ్చి, డబ్బుకు, మధ్యానికి అమ్ముడుపోవాలని చూసే వ్యక్తులకు లొంగవద్దు,” అని గట్టిగా హెచ్చరించారు. ఈరోజు సాధ్యం కాని హామీలు ఇచ్చి, రేపు గ్రామాన్ని దోచుకునే అవకాశం ఉందని, మనతో కలిసి ఉన్న, మన కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవాలని వెంకట్రావు పల్లె ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !