పంబాల వారి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి. శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి వృత్తి కళాకారుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు కందుకూరి మనోహర్ స్వామి.

bahubalamtv Reporter
bahubalamtv.in

పంబాల వారి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి. శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి వృత్తి కళాకారుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు కందుకూరి మనోహర్ స్వామి.

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
హుజూరాబాద్, మే 8: పంబాల, పోతరాజులు మొదలగు పేర్లతో తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించి ఉన్న కళాకారులు శక్తి పీఠాల్లో ఒకరైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవిని ఎక్కువగా పూజిస్తారు. ఎల్లమ్మ దేవత పూజా విధానాన్ని కాటమరాజు కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాప్తి చేశారు.
పురాణాల ప్రకారం, పరశురాముని నుండి కొంతకాలం తప్పించుకోవడానికి ఎల్లమ్మ తొల్ల నానబట్టె గోలెంలో దాక్కోవడం వలన మాదిగలకు, పగలు తాల్ల వనంలో తిరగడం వలన గౌండ్ల వారికి ఆమె ఆరాధ్య దేవతగా చరిత్రలో నిలిచింది. దాక్కున్న ఎల్లమ్మను వెలికి తీయడానికి పరశురాముడు సైతం భవానీయులైన పంబాల వారి వేషం ధరించి, జమిడిక, పంబ జోడు వంటి వాయిద్యాలతో ప్రార్థించి, తాంత్రిక పూజలు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడని చెబుతారు.
అలాంటి పంబాల వారు అమ్మవారికి దాయి తమ్ముడిగా పిలువబడతారు. అమ్మవారి పూజల్లో పంబాల వారి భాగస్వామ్యం తప్పనిసరి. అయితే, కొందరు స్వార్థపరులైన పూజారులు పంబాల వారిని రేణుకా ఎల్లమ్మ దేవి పూజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి వృత్తి కళాకారుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు కందుకూరి మనోహర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మతః హక్కులు కలిగిన పంబాల వారి వృత్తికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !