బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 28:
హుజురాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హుజురాబాద్ శాఖ పేదలకు ఆర్థికంగా అండగా నిలిచింది. బ్యాంకు మేనేజర్ ప్రత్యేక చొరవతో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద దమ్మకపేటకు చెందిన బి. ఎల్లమ్మ అనే లబ్ధిదారునికి మినీ డైరీ ఫామ్ ఏర్పాటు కోసం రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పేదల రాజ్యాధికార సమితి (TPRS) రాష్ట్ర అధ్యక్షులు పేదల పెన్నిధి ప్రేమన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోరాగాల సమ్మయ్య మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్‌కు తెలంగాణ పేదల రాజ్యాధికార సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున పేద మహిళకు ఉపాధి కల్పించేందుకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ రుణం ద్వారా ఎల్లమ్మ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
లబ్ధిదారురాలు బి. ఎల్లమ్మ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు చూపిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రుణం తన కుటుంబానికి జీవనోపాధినిస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు పేదల సంఘం నాయకులు పాల్గొన్నారు
