బాహుబలం న్యూస్ సైదాపూర్, ప్రతినిధి మార్చి:31
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు నూతన దుస్తువులు ధరించి వచ్చి ఈదుగా లో నమాజ్ చేసిన అనంతరం ఒకరికి ఒకరు అలాయి బలాయి ఆ లింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు మన భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశం మన భారతదేశం అని ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండరు అనుసరిస్తారు. దీని ప్రకారం రంజాన్ తొమ్మిదో నెల అని అది కూడా నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. దీన్ని ‘రోజా’ అని పిలుస్తారు. ఆహారం, పానీయం అన్నింటికీ దూరంగా ఉంటారు. ఇక ఈ ఉపవాస దీక్షను మూడు అష్త్రాలుగా విభజించారు. తొలి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. ఖర్జూరాలను తిని ఉపవాసాలను విరమించుకుంటారు. మహమ్మద్ ప్రవక్త తన ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలనే తినేవారని చెప్పుకుంటారు. కఠినమైన పవిత్ర ఉపవాసాలు ఉంటారు ముస్లింల మత గ్రంథమైన ‘ఖురాన్’ ఈ మాసంలోనే ఆవిర్భవించింది . అందుకే రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంథాన్ని ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు తెలిపారు
