బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి : పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన కాయిత రాములు, కామని రవీందర్ లను మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టా ప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ… కాయిత రాములు, కామని రవీందర్ లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. పాత్రికేయులు ప్రజా పక్షాన నిలబడి ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ వాటి పరిష్కారం కోసం నిరంతరము పాటుపడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసి పత్రికా సారథులుగా అందరి మన్ననలను పొందాలని కోరారు. అలాగే పాత్రికేయులు సమాజాభివృద్ధిలో ఒక మూల స్తంభముగా ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు సమాజం యొక్క అభివృద్ధి కొరకు సమసమాజ స్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో టా ప్ర జిల్లా శాఖ ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునీరుద్దీన్, రావికంటి రామకృష్ణయ్య, టాప్రా హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య ,కోశాధికారి మండల వీరస్వామి, జయన్న ఫౌండేషన్ అధ్యక్షులు గుడిపాటి జయపాల్ రెడ్డి, అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్ ,జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్ పటేల్ ,ఆలేటి రవీందర్, సందేల వెంకన్న, టా ప్ర నాయకులు తాటిపాముల కనకయ్య, సొల్లేటి మల్లారెడ్డి, గుంటి ఎల్లయ్య, గంగిశెట్టి సాంబయ్య ,దొంత హరికిషన్, తౌటం శ్రీహరి, గూడూరి స్వామి రెడ్డి ,గాజ గంగయ్య, చందుపట్ల రామ్మూర్తి, కొత్తగట్టు రాజిరెడ్డి, వేల్పుల భాస్కర్ ముక్కెర మొగిలి, రామ్ రాజేశ్వర్, గరవేన శ్రీకాంత్ ,ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు
