ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సన్మానం.

బాహుబలం న్యూస్;హుజురాబాద్ ప్రతినిధి మార్చి15:
నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ లు మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి గెలిపించిన జర్నలిస్టుల సమస్యల సాధన కోసం ఎల్లవేళలా పోరాడుతామన్నారు. ముఖ్యంగా నివేషశన స్థలాల పూర్తిస్థాయి సాధన కోసం తాము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని, ఇళ్ల సమస్య పరిష్కారం కోసం త్వరలోనే కార్యాచరణ చేపడతామని అన్నారు. తమ ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మద్దతు తెలియజేయాలని కోరారు. ప్రజా సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు స్పందించడానికి ప్రెస్ క్లబ్ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై తమ కలం ఎప్పుడు ప్రశ్నించే గొంతుకలానే ఉంటుందన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో జర్నలిజంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం వల్ల పేద, దళిత, బహుజనలకు న్యాయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రాపు రామచంద్రం, మారపల్లి శ్రీనివాస్ , తునికి వసంత్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు పుల్ల రాధ, పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, సొల్లు సునీత, మొలుగు రాద, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు ఎర్ర రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తడకమళ్ళ శేఖర్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు మొలుగూరి ప్రభాకర్, రుద్రారపు రవితేజ, మోరె సతీష్, అందాసి నారాయణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.


Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !