ఘనంగా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి. .

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
మహాసాద్వి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి హుజురాబాద్ లో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది, ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాయకులందరూ ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ తాను మొదట విద్య నేర్చుకుని తర్వాత భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అవతరించి పేద ప్రజలకు మహారాష్ట్ర ప్రాంతంలో విద్యలయాలు స్థాపించి పేద వర్గాల పిల్లలకు చదువును నేర్పించారని తర్వాత జ్యోతిరావు పూలే దంపతులు వృద్ధులకు, వితంతువులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే జీవితం నేటి మహిళలకు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ కమిషనర్ కింసారపు సమ్మయ్య, జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రఘు చారి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందే రాధిక, కొలిపాక శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ కాలిక్ హుస్సేన్, గుడిపాటి జైపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు యేముల పుష్పలత , సొల్లు సునీత , పుల్ల రాధ, గోస్కుల నాగమణి, మల్లీశ్వరి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, సొల్లు బాబు, కొలిపాక సమ్మయ్య, వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, వేల్పుల ప్రభాకర్, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే జలీల్ , గోస్కుల మధు, రియాజ్, మొలుగు ప్రభాకర్, తులసి లక్ష్మణమూర్తి, మార్త రవీందర్, ఇల్లందుల సమ్మయ్య, ఎర్ర శ్రీధర్ ,బొరగాల సారయ్య, పశుల స్వామి, మిడిదొడ్డిరాజు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !