ఇరాన్ ఒకప్పటి పర్షియా….

ఇరాన్ ని ఒకప్పుడు పర్షియా అనే వాళ్లు. అక్కడ 3500 ఏళ్ల క్రితం జొరాష్ట్ర మతం ఉండేది. అది అహుర మజ్డా అనే ఒకే దేవుడిని ప్రార్దించే మతం. సాధారణ శకానికి పూర్వం 15వ శతాబ్దంలో జరతుస్త్ర/జొరాస్టర్ అనే ప్రవక్త మొదలు పెట్టాడు. అక్కడ అవెస్టా అనే భాష ఉండేది. Hymns & chants (మంత్రాలు, శ్లోకాలు) ఆ అవెస్టా లోనే తయారు చేసుకున్నారు. ఆ కాలంలో రాసి ప్రిజర్వ్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్లు కూడా బట్టి కొట్టే వాళ్లు.

ఈ అవెస్టా అనేది మంత్రాల, యజ్ఞాల భాష అయితే పర్షియాలో సాధారణ జనం మాట్లాడే భాష మాత్రం పార్శి. అదే ఇప్పుడు ఫార్సీ (Farsi) అని కూడా పిలవబడుతుంది. ఇరాన్ వాళ్లు ఇప్పుడు మాట్లాడే భాష ఇదే. మతం ఇస్లాం అయినా భాష మాత్రం ఫార్సీ నే ఇప్పటికి. అందుకేనేమో, జుబాన్ మజాబ్ కి నహి కిత్తే కి హోతి హై అంటారు. అంటే భాషలు మతానికి సంబంధించినవి కాదు, ప్రాంతానికి సంబంధించినవి అని.

మన వాళ్లు దాన్ని తెలుగీకరించి పారశీకం అంటారు. స్వాతంత్ర్యనికి పూర్వం ఈ పారశీకం మన స్కూల్స్ లో నేర్పేవారు ఎందుకో మరి!!

ఈ అవెస్టా, ఫార్సీ, సంస్కృతం ఇవన్నిటికి చాలా కామన్ మూల పదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండో-ఇరానియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు అని భాషా శాస్త్ర పండితులు చెప్తారు.

ఇరాన్ లో 7 వ శతాబ్దం దాకా ఈ జొరాష్ట్ర మతం (Zoroastrianism) బాగా వర్ధిల్లింది. 7 వ శతాబ్దంలో మక్కా-మదీనా లో ఇస్లాం తయారు చేశారు. ఆ మత వ్యాప్తే జీవిత లక్ష్యం అని నూరిపోశారు. అనతి కాలంలోనే 2000 కిలోమిటర్ల దూరంలో ఉన్న పర్షియా (ఇరాన్) వ్యాప్తి చెందింది. చుర కత్తులు ఝుళిపించాయి. జొరాష్ట్ర మతాన్ని వదిలి ఇస్లాం స్వీకరించాలి లేదా చావాలి. మెడ మీద కత్తి పెట్టి ” హై ఆ నై ఆ ” అని అడిగే వాళ్లు.

ఈ మత ఊచకోత నుంచి తప్పించుకోడానికి కొన్ని లక్షల మంది జొరాస్టరులు పారిపోయి మన దేశానికి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళల్లో టాటా లు కూడా ఉన్నారు.. ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని సొంత దేశంలా భావించారు. ఇక్కడ ఉండి అక్కడి బాగు కోరే నీచపు పనులు చేయలేదు. హోమి జహంగీర్ బాబా లాంటి వాళ్లు మన దేశం అణుశక్తి కలిగి ఉండటానికి కారణం. అయన దానికోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. టాటా లు, ఈ బాబా లు చుట్టాలే. ఇందిరా గాంధీ భర్త కూడా పార్సీ నే. చాలా మంది పేరు చూసి అనుకున్నట్టు ఇస్లాం అతను కాదు.

అయితే ఈ అవెస్ట భాష మాట్లాడే తెగ వారి వృత్తి అయిన మంత్రాలు శ్లోకాలు వదిలిపెట్టలేదు.. వారికి కష్టపడి పని చేసే తత్వం ఉండేది కాదు.. కూర్చున్న చోటే మాయలు మంత్రాలు మాటలు చెప్పి కడుపు నింపుకునేవారు.. అదే ఉరవడి మనదేశంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు..ముందుగా వారి జీవనోపాధి కోసం సామంత రాజుల వద్ద ఆస్థాన కవులుగా చేరారు.. రాజులను పొగడడం..పాటలు పాడటం స్త్రీలతో నృత్యాలు చేయించడం..ఇలా కొత్త సంస్కృతిని స్టార్ట్ చేశారు..

ఎలాగైనా సరే ఈ దేశంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్న వారికి ఇక్కడ ఉన్న జ్ఞాన సంపద బౌద్ధ ప్రొఫెసర్లు యూనివర్సిటీలు బౌద్ధ మార్గం పెద్ద అడ్డంకిగా మారాయి..
వారి యొక్క ఉనికి ఉండాలి అంటే ముందు ఈ దేశంలో బౌద్ధం ఉండకూడదు జ్ఞాన సంపద ఉండకూడదు అందుకు పక్క ప్రణాళిక వేసుకున్నారు.

మెల్లిమెల్లిగా ఇక్కడున్న రాజులకు పంచభూతాలను అడ్డుపెట్టి మీకు అగ్ని గండం..నీటి గండం.. వాయుగండం ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని మీ జీవితంలో ఆల్రెడీ ఈ గండాలను తప్పించుకున్నారు ముందు రోజుల్లో జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్టు వినాలని.. భయభ్రాంతులకు గురి దాదాపు రాజులను కట్టడి చేశారు..

ఇక్కడ ఉన్న సంస్కృతి నాశనం చేయాలి జ్ఞానాన్ని అంతం చేయాలి ప్రజలను అజ్ఞానులుగా చేయాలనీ.. అప్పుడే వారి పని సులువు అవుతుందని నిర్ణయించుకున్నారు.
వారి దాయాదులైన మహమ్మద్ గజిని.. భక్తియార్ కిల్జీ రాజులను పిలిపించి ఇక్కడ ఉన్న సంపదను కావలసినంత దోచుకోమని చెప్పి ఇక్కడ ఉన్న సంస్కృతిని నాశనం చేయించారు. మన దేశవ్యాప్తంగా జ్ఞాన సంపద ఉన్న నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయించారు..

ఇక్కడ ఉన్న రాజులు ఈ ఆవెష్ట భాష జాతి మాయమాటలలో పడి విదేశీయులు ధ్వంసం చేస్తున్న ప్రతిఘటించడానికి వెనకడుగు వేశారు.

అయితే రుచి మరిగిన కోడి బుద్ధి మానుతుందా.. అనే సామెత లాగా ఇరాన్ రాజులు నలంద సోమనాథ్ టెంపుల్ లో సంపదను దోచుకున్నాక.. మన దేశంపై దండయాత్రలు చేశారు మెల్లిమెల్లిగా దేశాన్ని ఆక్రమించుకున్నారు..
ఈ అవెస్ట భాష జాతికి కూడా కావలసింది అదే.. దేశం ఎటుపోయిన సరే వారి యొక్క సిద్ధాంతం మాత్రం పదిలంగా ఉండాలి.. అప్పుడే వారికి జీవనోపాధి కలుగుతుంది.. మొగల్ చక్రవర్తులు కూడా ఎక్కడ వైదిక ధర్మాన్ని ఇబ్బంది పెట్టలేదు వారి పరిపాలన వారు చేసుకున్నారు దోచుకున్నారు.

మొఘలుల పరిపాలనలో అప్పుడే దేశ అధికారిక భాష పాళీ భాష రద్దయింది..అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, పరిపాలనా ఉత్తర్వులు, కోర్ట్ కచేరీలు ఫార్సీ లోనే నడిచేవి.

ఇంక పోతే ఫార్సీ, అరబ్బి, టర్కీ పదాలు వాడుతూ హిందీ గ్రామర్ ప్రకారం హిందావి అనే ఒక భాష తయారు తయారయింది 12వ శతాబ్దంలో ఢిల్లీ చుట్టుపక్కల దాన్ని రేఖ్తా అని కూడా అనే వాళ్లు. ఇప్పుడు ఉర్దు అంటున్నారు.

జోరాష్టియన్ల అవెస్ట భాష జాతి గ్రంథాలకు వైదిక గ్రంథాలకు ఉన్న సారూప్యతను చూద్దాం :

అహుర మజ్డా దేవుడు ఎవరోకాదు..విష్ణుమూర్తి లాంటి దేవుడు..

పర్షియా భాషలో సకారాన్ని.. హకారంగా ఉచ్చరిస్తారు.. అందుకే మన సింధు దేశం కాస్తా.. హిందూదేశం అయింది..

ఇంతకూ అహుర పదం .. అసుర పదం ఒక్కటే…

మజ్డా పదం మర్దన పదం ఒక్కటే…

అసుర మర్దన… పదమే పర్షియా లో అహుర మజ్డా అయింది..

ఇక వేద పురాణాల్లోని అసురులు..జోరాష్ట్రియన్ లోని అహురులు…మరెవరో కారు…బాబిలోనియాకు చెందిన అస్సీరియన్స్…

ఇలా ఎన్నో కంపేరిటివ్ స్టడీస్ చేసిన గ్రంథాలు.. చదివితే.. వైదిక (జురాస్టియన్ ) ధర్మం యొక్క వేళ్ళు ఎంత లోతుగా ఉన్నాయో అర్థం అవుతుంది..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !