గీత కార్మికుల రక్షణ కోసమే రక్షణ కవచం హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ గౌడ్

సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 31:
గీత కార్మికులు తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగి ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఆలోచించి గౌడ్ అన్నలకు కాటమయ్య రక్షణ కవచం శిక్షణ ఇస్తున్నామని హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం చాలామంది గీత కార్మికులు చెట్టు ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు కిందపడి మరణిస్తున్నారని అన్నారు. రక్షణ కవచం ఉండడంవల్ల తాడు మధ్యలో అనుకోకుండా కాలు జారినప్పటికీ ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. గీత కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గీత కార్మికుల రక్షణ కవచం కోసం ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. శిక్షణ కాలం పూర్తయిన వెంటనే అందరికీ రక్షణ కవచాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బందితోపాటు గీత కార్మికులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !