బాహుబలం ప్రతినిధి హన్మకొండ ఆగస్టు 27;హన్మకొండ
కు చెందిన ప్రముఖ చిత్రకారిణి,ఎల్ బి కళాశాల బి . ఎడ్,లెక్చరర్,సామాజిక వేత్త,సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ మంజులకు ఈరోజు విజయవాడ లో జరిగిన మద ర్ థెరిస్సా సర్వీస్ సొసైటీ రెండవ వార్షికోత్సవం సందర్భం గా నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు- 2024 ను అందించారు. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనే కాకుండా పలు రాష్ట్రాల నుండి వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ఈ సత్కారం చేసారు.మంజుల ఉపాధ్యాయ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తూ, తన అకాడ మి ద్వారా చిత్రకళా రంగానికి, తనదైన శైలి లో సేవ చేస్తూ, ఎంతో మంది చిన్నారులకు చిత్ర కళ లో మెలకువ లు నేర్పిస్తున్నారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తో పాటు అతిధులు మంజులని అభినందిం చి శాలువా, ప్రశంసా పత్రం,జ్ఞాపిక తో ఘనంగా సన్మానిం చారు. పలువురు ప్రముఖులు,స్థానిక ఆర్టిస్టులు ,ఎల్ బి కాలేజీ లెక్చరర్స్ మంజులకు అభినందనలు తెలిపారు. ఆమె సొసైటీ బాధ్యులకు,తోటి స్థానిక ఆర్టిస్టుల కు కృతజ్ఞతలు తెలిపారు.
