బీజేపీని ఓడించడి దేశాన్ని రక్షించండి బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇండియా కూటమిని గెలిపిద్దాం…. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
హుజురాబాద్:ఇండియా కూటమి అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చేస్తున్నా వెలిశాల రాజేందర్ రావు
గెలుపును మతతత్వ శక్తులకు దానికి పరోక్షంగా సహకరించే శక్తులు అడ్డుకోలేవని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు.హుజురాబాద్ మండల కేంద్రంలో కూరగా యల మార్కెట్,జమ్మికుంట రోడ్డు లో సీపీఐ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను మోసం చేసిన మోడీ ప్రభుత్వంనికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్దాంగా ఉన్నారు అని,పదేళ్ల మోడీపాలన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడంతోనే సాగిందని అన్నారు. కులాలు,మతాలమధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నా రని అన్నారు.మతతత్వ కార్పొరేట్ పార్టీలను తెలంగాణలో అడుగుపెట్టనీయబోవని అన్నారు.రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటు సాక్షిగా బిజెపి ప్రభుత్వం తెస్తుంటే పరోక్షంగా సహకరించిన టిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసిన ట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఈ దేశ ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజ మాన్యాలకు,కార్పొరేట్ సంస్థలకు,పెట్టుబడిదారులకు అను కూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని 20 సంవత్సరాల దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపించారు.వెలిశాల రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ప్రతి బూతులో ప్రతి ఓటర్లు కలిసి మోడీ నిరంకస పాలనపై చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్,జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ సీపీఐ పట్టణ కార్యదర్శి ముత్త రాజు,ఏఐఎస్ఎఫ్ నాయకులు రోహిత్, అభి, సందీప్,సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య,మల్లయ్య, ఎల్లమ్మ, జల్లా గీతా, మాధురి, మజిర రెడ్డి,మంజుల రెడ్డి, బండి మమ్మీ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !