సమగ్ర శిక్ష ఉద్యోగుల టర్మినేషన్ విధానం తొలగించాలి పిటిఐ లను అందరితోపాటు రి ఎంగేజ్ చేయాలి.

బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24
[హుజూరాబాద్ ] విద్యాశాఖలో అనుబంధంగా నడుస్తున్న తెలంగాణ సమగ్ర శిక్షలో దాదాపుగా 22వేల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ కేటగిరీలలో గత 15-16 సంవత్స రాలుగా పనిచేస్తున్నా అప్పటినుండి చాలీ చాలని వేతనాలతో వెట్టి చాకిరి చేస్తూ బతికిడిస్తున్నామని తెలంగాణ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖపేర్కొంది.ఈ విధానాన్ని నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేపట్టడం జరిగిందనీ ఇలాంటి నిరవధిక నిరసన కార్యక్రమం ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున గత సంవత్సరం ఆగస్టులో కూడా చేపట్టడం జరిగింది.ప్రధానమైన డిమాండ్స్ ఏమనగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి,ఈలోగా తక్షణమే టైం స్కేల్ కల్పిస్తూ టర్మినేషన్ విధానాన్ని ఎత్తి వేయాలని, రెగ్యులరైజ్ అయ్యేంతవరకు ఆటో రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్నికోరారు. మొన్నా నిరవధిక నిరసన కార్య క్రమంలో భాగంగా సెప్టెంబర్ 13వ తేదీ నాడు హన్మకొండలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక నిరసన శిబిరానికి అప్పటి తెలం గాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో ఏనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేసి మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో మీ సంఘ నాయకులను పిలిపించి మాట్లాడి మీ డిమాండ్స్ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలకు హాజరై డిమాండ్స్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారనీ తెలంగాణ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ కరీంన గర్ జిల్లా శాఖ పేర్కొంది.ప్రస్తుతం దాని ఊసే లేదు,పోగా టెర్మినేషన్ పేరుతో 3-4రోజులు తొలగిస్తూ మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ ,ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము.దీనిని మేము ఖండిస్తున్నాం అని అన్నారు.
అలాగే సమగ్ర శిక్షలో వేతనాలే అంతంత మాత్రం,అందరు కూడా దీన్నే నమ్ముకుని పని చేస్తున్నారు.ఈ టర్మినేషన్ అందరిని చేసి,4 రోజుల గ్యాప్ లో రి ఎంగేజ్ చేస్తూ ,పాఠశాల స్థాయిలో పనిచేసే పి టి ఐ (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) లను మాత్రం తొలగించి రి ఎంగేజ్ ఇవ్వకపోవడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.ప్రతి సంవత్స రం ఇలా ఆగడం వల్ల తీవ్రమైన నష్టానికి గురవుతూ కుటుంబాన్ని నడపడం భార మవుతుంది. ప్రభుత్వం తక్షణమే మానవతా దృక్పథంతో స్పందించి పీటీఐ లను కూడా రి ఎంగేజ్ చేయాలని కోరుతున్నామనీ తెలం గాణ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖవారు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !