హుజురాబాద్ ఏప్రిల్ 15 ,.
హుజురాబాద్ మండలంలోని దమ్మక్కపేట గ్రామంలో సోమ వారం రోజున తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అంబేద్క ర్ జయంతి ఉత్సవాలను
ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ వాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాం గ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపో యే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని అంటరాని తనాన్ని వ్యతిరేకి స్తూ .దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుం డా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధి కారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ జయంతిని పుర స్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటోందని వారు అన్నారు.కేకులు కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్ర మంలో తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగారం ప్రేమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బోరుగాల సమ్మయ్య ,(సారయ్య) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లూరి రఘుచారి, కోశాధికారి బోరుగాల సునీల్ ఉపాధ్యక్షుడు ఇల్లందుల సమ్మయ్య,(పోస్టు) 8 వ వార్డు కౌన్సిలర్ బొరుగాల శివకుమార్, 9 వ వార్డ్ కౌన్సిలర్ మెరుగు కొండల్ రెడ్డి, హుజురాబాద్ అంబే ద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులు ఎండి.ఖ లీద్ హుస్సేన్, జ్యోతి బాపూలే అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రావ్ కమిటీ అధ్యక్షులు రొంటాల సుమన్ సీనియర్ అడ్వ కేట్ ముక్కెర రాజు సింగపూర్ ఎంపిటిసి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం కాజీపేట శ్రీనివాస్ , సమ్మిరెడ్డి సీనియర్ వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
