*
హుజూరాబాద్ ఏప్రిల్ 16 బహుబలం న్యూస్
ప్రసుత యసంగిలో గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని రైతులు కోసిన వరి ధాన్యాన్ని సరైన తేమ శాతం వచ్చేలా ఆరబెట్టి కొనుగోలు కేంద్రములో అమ్ముకొని మద్దతు ధర పొందాలని వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ మండలములో రంగాపుర్, ఇప్పలనర్సింగపూర్, దమ్మక్కపేట లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శంచి వడ్ల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో అక్కడక్కడ రైతులతో మాట్లాడుతూ కొంత మంది దళారులు రైతుల పొలం దగ్గరికే వెళ్లి తక్కువ ధరకు కొనుగొలుచేస్తారని అలాంటి వారికి ధాన్యాలను అమ్ముకోని నష్టపోవద్దని తెలియజేశారు. రైతులు ధాన్యాన్ని మంచిగా శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రంలో మాత్రమే అమ్ముకొని మద్దతు ధర ఒక క్వింటాలుకు A గ్రేడ్ రకముకి రూ. 2203, సాధారణ రకముకి రూ. 2183 లుగా పొందవచ్చని అన్నారు. హుజూరాబాద్ సొసైటీ సి.ఇ.ఓ వివేకానంద, డి.సి.ఎం.ఎస్ ఇంఛార్జి ప్రదీప్ కుమార్ లు పాల్గొన్నారు.
