సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం

సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్‌ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. కేబినెట్ మీటింగులో 16కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌తో పాటు వైశ్య, మైనార్టీ, సంత్‌సేవాలాల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు.

అంతే కాకుండా కొత్త రేషన్‌ కార్డుల జారీకి కూడా తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్ అలీఖాన్‌ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మరోసారి గవర్నర్‌ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం తీర్మానించింది. వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్ చర్చించింది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా మంత్రి వర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది.

తెలంగాణ కేబినెట్‌ మరికొన్ని కీలక నిర్ణయాలు

* ఔటర్‌ చుట్టూ మహిళా రైతు బజార్లు

* కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు.. విచారణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్‌ పినాకిని చంద్రబోస్‌

* విద్యుత్‌ కొనుగోళ్లపైనా మరో కమిటీ.. చైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి

* రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం

* యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..