రైతు గమ్యం.. కరీంనగర్ వైపు సమర గర్జన! 28న 2 లక్షల మందితో జలపాతంలా తరలిరావాలి: పోలాడి రామారావు పిలుపు – అన్నదాతల హక్కుల కోసం రాజీలేని పోరాటం – పార్టీలకతీతంగా ఏకమవుతున్న కర్షక లోకం – అఖిలపక్ష నేతలతో కలిసి వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..

బాహు బలంన్యూస్ హైదరాబాద్ (సిటీ బ్యూరో): తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై గళమెత్తేందుకు, పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఈనెల 28న కరీంనగర్ గడ్డపై ‘రైతు మహా గర్జన’ సమరభేరి మోగనుంది. రెండు లక్షల మంది రైతులతో అపూర్వ రీతిలో నిర్వహించ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో రాష్ట్ర ప్రజా సంఘాల నేతలు, జిల్లా బాధ్యులతో కీలక సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
రాజకీయ పక్షాల ఏకధాటి మద్దతు
ఈ సమరభేరి సభను విజయవంతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా మద్దతు కూడగట్టే ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ భవన్‌లో పోలాడి రామారావు బృందం కలిసి ఆహ్వాన పత్రాలు అందజేసింది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేంద్ర గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, యువజన విభాగం నేతలతో భేటీ అయ్యారు. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ రైతు విభాగం నేతలను కలిసి చర్చలు జరిపారు. అన్ని పక్షాల నేతలు సానుకూలంగా స్పందిస్తూ మహా గర్జన పోస్టర్లను ఆవిష్కరించారు.
పాలకుల అలసత్వంపై పోరాటం
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కేవలం 30 శాతం మందికే పరిమితమైందని, మిగిలిన 70 శాతం రైతులు నేటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధుల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం సాగు సమయానికి నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు:
సమగ్ర రుణమాఫీ: అర్హులైన రైతులందరికీ ఎటువంటి కొర్రీలు లేకుండా తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలి.
రైతు పెన్షన్ & భీమా: 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు గౌరవప్రదంగా నెలకు రూ. 6,000 పెన్షన్ అందించాలి. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి.
పంట బోనస్: సన్న రకాలకే కాకుండా, రైతులు పండించే అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ చెల్లించాలి.
పాడి రైతుల ఊరట: పాల ఉత్పత్తిదారులకు గతంలో ఇచ్చే లీటరుకు రూ. 4 రాయితీని పునరుద్ధరించాలి.
సామాజిక న్యాయం: ఓసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయడంతో పాటు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి.
హక్కుల సాధనే అంతిమ లక్ష్యం
“పెట్టుబడి పెట్టిన యజమాని వస్తువు ధర నిర్ణయించుకుంటున్న ఈ సమాజంలో, ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతుకు తన పంటపై ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు” అని రామారావు వ్యాఖ్యానించారు. ఈ అన్యాయంపై పోరాడటమే ఈ మహా గర్జన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల జాతీయ ఉపాధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి రావు, నేతలు మూగ జయశ్రీ, చిత్తరంజన్ రెడ్డి, సుధీంద్ర చౌదరి, రమేష్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు గమ్యం.. కరీంనగర్ వైపు సమర గర్జన! 28న 2 లక్షల మందితో జలపాతంలా తరలిరావాలి: పోలాడి రామారావు పిలుపు – అన్నదాతల హక్కుల కోసం రాజీలేని పోరాటం – పార్టీలకతీతంగా ఏకమవుతున్న కర్షక లోకం – అఖిలపక్ష నేతలతో కలిసి వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..

జననీరాజనం.. దామోదర్ రెడ్డి అజరామరం! కరీంనగర్‌లో మాజీ మంత్రి ముద్దసాని కాంస్య విగ్రహావిష్కరణ తరలివచ్చిన వేలాది మంది అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమోఘం: పోలాడి రామారావు..

పాలకుల నిర్లక్ష్యంపై ‘రైతు మహా గర్జన’.. కరీంనగర్ వేదికగా పోరునగారా! నమ్మించి మోసం చేసిన సర్కార్‌పై సమరభేరి.. ఈ నెల 28న 2 లక్షల మందితో జైత్రయాత్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆహ్వానం – పోలాడి రామారావు నిప్పులు.

హుజూరాబాద్‌పై ‘డంపింగ్’ కుట్ర… గాంధీ వారసుల సహనం పరీక్షించకండి.. అన్యాయంపై గాడ్సేలలా మారుతాం: “మా ఊపిరి తీస్తే.. మీ కుర్చీలు కూలుతాయి” – అకినేపల్లి అర్ధనగ్న దీక్షతో సెగలు గక్కుతున్న . రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !