మహిళల గౌరవమే లక్ష్యంగా 29వ వార్డులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – కౌన్సిలర్ బొరగాల మొగిలి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం.

bahubalamtv Reporter
bahubalamtv.in

మహిళల గౌరవమే లక్ష్యంగా 29వ వార్డులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – కౌన్సిలర్ బొరగాల మొగిలి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మార్చి 08:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని 29వ వార్డులో మహిళా చైతన్యం ఉట్టిపడింది. నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్, రిటైర్డ్ ఏఈ (AE) బొరగాల మొగిలి ఆధ్వర్యంలో వార్డులోని మహిళలను గౌరవిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళా మూర్తులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు.
సేవకుడిగా ప్రజల చెంతకు:
రిటైర్డ్ ఏఈగా సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో అనుభవం గడించిన బొరగాల మొగిలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన మహిళా దినోత్సవం కావడంతో, వార్డులోని ఆడబిడ్డలందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి వారిని సత్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితం - కౌన్సిలర్ మొగిలి:
ఈ సందర్భంగా కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ, తన పిలుపు మేరకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో హుజూరాబాద్ మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మరియు ఉన్నతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రణవ్ గారి అభివృద్ధి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఒక సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
మహిళా శక్తికి నీరాజనం:
వేల్పుల రత్నం మరియు ఇతర ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ శక్తి ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా మొగిలి కౌన్సిలర్‌గా విజయం సాధించడంలో వారి ధర్మపత్ని అందించిన సహకారం వెలకట్టలేనిదని ప్రశంసించారు. తన పదవీ కాలం ముగిసే వరకు ప్రతి ఏటా ఇదే ఉత్సాహంతో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తానని, మహిళల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని మొగిలి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఘన సన్మానం - బహుమతుల ప్రదానం.
ఈ వేడుకల్లో భాగంగా అంగన్‌వాడీ టీచర్ రొంటాల పద్మ, ఆశా కార్యకర్తలు తిరుమల, ప్రమీల, మెప్మా ఆర్ పి బొరగాల రమాదేవిలతో పాటు మున్సిపల్ సిబ్బంది రొంటాల భాగ్య, గిన్నారపు లక్ష్మి తదితరులను కౌన్సిలర్ మొగిలి శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, బత్తుల రాజలింగం, బీజేపీ నాయకులు బొరగాల సారయ్య, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, పాత్రికేయులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మార్చి 08:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని 29వ వార్డులో మహిళా చైతన్యం ఉట్టిపడింది. నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్, రిటైర్డ్ ఏఈ (AE) బొరగాల మొగిలి ఆధ్వర్యంలో వార్డులోని మహిళలను గౌరవిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళా మూర్తులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు.
సేవకుడిగా ప్రజల చెంతకు:
రిటైర్డ్ ఏఈగా సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో అనుభవం గడించిన బొరగాల మొగిలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన మహిళా దినోత్సవం కావడంతో, వార్డులోని ఆడబిడ్డలందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి వారిని సత్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితం – కౌన్సిలర్ మొగిలి:
ఈ సందర్భంగా కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ, తన పిలుపు మేరకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో హుజూరాబాద్ మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మరియు ఉన్నతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రణవ్ గారి అభివృద్ధి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఒక సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
మహిళా శక్తికి నీరాజనం:
వేల్పుల రత్నం మరియు ఇతర ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ శక్తి ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా మొగిలి కౌన్సిలర్‌గా విజయం సాధించడంలో వారి ధర్మపత్ని అందించిన సహకారం వెలకట్టలేనిదని ప్రశంసించారు. తన పదవీ కాలం ముగిసే వరకు ప్రతి ఏటా ఇదే ఉత్సాహంతో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తానని, మహిళల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని మొగిలి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఘన సన్మానం – బహుమతుల ప్రదానం.
ఈ వేడుకల్లో భాగంగా అంగన్‌వాడీ టీచర్ రొంటాల పద్మ, ఆశా కార్యకర్తలు తిరుమల, ప్రమీల, మెప్మా ఆర్ పి బొరగాల రమాదేవిలతో పాటు మున్సిపల్ సిబ్బంది రొంటాల భాగ్య, గిన్నారపు లక్ష్మి తదితరులను కౌన్సిలర్ మొగిలి శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, బత్తుల రాజలింగం, బీజేపీ నాయకులు బొరగాల సారయ్య, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, పాత్రికేయులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !