మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి: మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గాంధీనగర్ రోడ్డులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఏప్రిల్ 11న రాష్ట్రస్థాయి భారీ జాబ్ మేళాలు .

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మార్చి 08:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం పట్టణంలోని గాంధీనగర్ రోడ్డులో పాత కరెంట్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. “మహిళలు శక్తివంతులైతేనే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తుంది. ఒక మహిళకు విద్యను అందించడం అంటే ఆ కుటుంబం మొత్తానికి విజ్ఞానాన్ని పంచి, వెలుగులు నింపడమే” అని ఆయన స్పష్టం చేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల కొనసాగుతున్న వివక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలను తొలగించి, మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల అందజేత..
ఈ వేడుకల్లో భాగంగా, గత కొంతకాలంగా నిర్వహించిన కుట్టు శిక్షణ మరియు వృత్తి విద్యా నైపుణ్యాలలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు కపిలవాయి దిలీప్ కుమార్ ట్రైనింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ నైపుణ్యం వారి ఆర్థిక స్వావలంబనకు, స్వయం ఉపాధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఏప్రిల్ 11న భారీ జాబ్ మేళా.
కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, నిరుద్యోగ మహిళలు మరియు యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఆర్.ఎల్.డి పార్టీ తరపున భారీ కార్యాచరణను ఆయన ప్రకటించారు. వచ్చే నెల ఏప్రిల్ 11వ తేదీన నుండి రాష్ట్రస్థాయి జాబ్ మేళాలు మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా కోటి రూపాయల విలువైన ఉపాధి అవకాశాలను కల్పించామని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎల్.డి పార్టీ అధికార ప్రతినిధి గౌర వీరప్ప, జనరల్ సెక్రెటరీ నరసింహారావు, జిల్లా అధ్యక్షులు బియ్యాల, కృష్ణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆసంపల్లి అజయ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని మరియు పార్టీ ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటం. మద్దతు ప్రకటించిన రాష్ట్ర మహిళా సంఘాలు; 8 వేల మందితో హాజరవుతామని వెల్లడి. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

ధాన్యపు కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం: విలవిలలాడుతున్న అన్నదాతలు – తరుగు పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల కోత విధిస్తూ నిలువు దోపిడీ – మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజం.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.