ప్రజాకవి తత్తువేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు, డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి మయూరి పురస్కార ప్రధానం .

హుజూరాబాద్ ఏప్రిల్ 15
పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సంపూర్ణ ఆధ్యాత్మిక బోధన గురువు, బ్రహ్మశ్రీ తత్వవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు ఉగాది పండుగ పురస్కరించుకొని జాతీయ స్థాయి మయూరి పురస్కారాన్ని తెలుగు వెలుగు సాహితీ సంస్థ వేదిక, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్ ,సత్యగౌడ్ సామాజిక సేవలు,వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి.వీరిని జాతీయస్థాయి మయూరి పురస్కారానికి ఎంపిక చేసి, ఈ
పురస్కారాన్ని హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ మీటింగ్ హాల్లో సోమవారం రోజున సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, జ్ఞాపకను అందజేసి,గురు కిరీటాన్ని గోల్డ్ మెడల్నుదరింపజేసి, మయూరి పురస్కారాన్ని ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజకుమార్ తో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. సత్యంగౌడ్ సామాజిక సేవలు, వారి సామాజిక రచనలు, ఆధ్యాత్మిక బోధనలు ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోరుతూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదిగి,చదువుతో పాటు, సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న మానవతా విలువలు పెంపొందించుకోవాలి అనే పలు ప్రధాన అంశాల మీద సెమినార్లు ఇస్తున్న సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం సత్యం గౌడ్ మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. స్వలాభం సంతృప్తి ప్రధానం కాదని, సాటి మనిషి మేలుకోరడంలోనే మానవత్వం దాగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో
సభాధ్యక్షులు శాంతి కృష్ణ సంస్థ వ్యవస్థాపకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, సరస్వతి మాత ఉపాసకులు బ్రహ్మశ్రీ విశ్వ కళ విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్యులతోపాటు ముఖ్య అతిథులు విశ్రాంత హైకోర్టు జస్టిస్ డాక్టర్ బెజ్జారం చంద్రకుమార్, బ్రహ్మశ్రీ కన్నకంటి వెంకటరమణ సంయుక్త సంచాలకులు సమాచార పౌర శాఖ, , ఐఏఎస్ విశ్రాంత మానేపల్లి సుబ్రహ్మణ్యం, డాక్టర్ టి గౌరీ శంకర్ పూర్వ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అధికార భాష సంఘం,,దైవజ్ఞాన శర్మ , సరస్వతి మాత ఉపాసకులు, శ్రీమతి డాక్టర్ గాయత్రి సురేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ శర్మ, సౌత్ ఇండియా చైర్మన్ నేషనల్ సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్ కటకం రాజేంద్రప్రసాద్, పెందట సోము, రంగశెట్టి రమేష్, అడ్డంకి కృష్ణమా చారి, మానపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ పాడి శెట్టి విష్ణువర్ధన్, బ్రహ్మశ్రీ తుమ్మనపల్లి పూర్ణ చంద్ర చార్యులు, పాడిశెట్టి గోపి నాదా చార్యులు, జిలకర వెంకన్న, కనుగుల మోహ న్, యాదగిరి గౌడ్, తాళ్లపల్లి స్వాతిక, వేముల వాడ రాధిక, ప్రముఖ కవి రచయిత కృష్ణమాచార్య, కళాకారుని రమాదేవి, కోమల కీర్తి, ప్రముఖ కవి రచయిత మహానటుడు తెన్నటి మాస్టర్ గౌరీ శంకర్, లక్ష్మి నరసింహ స్వామి, పోలిశెట్టి విష్ణువర్ధన్, ప్రముఖ ఆర్టిస్టు సామాజికవేత్త పంజాల నిహారిక, కవి రచయిత నటులు దీక్షితులు, మోహన్ రావు, ప్రముఖ కవి రచయిత ఎస్ ఎఫ్ ఎస్ కొండ మోహన్ రావు, డాక్టర్ పోలో జు భాస్కరాచార్యులు, ప్రముఖులు విద్యా వేత్తలు, ప్రముఖలు ప్రజా ప్రతినిధులు, వి ద్యావేత్తలు, ప్రొఫెసర్లు డాక్టర్లు, కళాకారులు కవులు రచయితలు తదితరులు పాల్గొన్నా రు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !