నేడు ఏపీ మీదుగా వెళ్లే మూడు వందేభారత్ ట్రైన్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని..

నేడు ఏపీ మీదుగా వెళ్లే మూడు వందేభారత్ ట్రైన్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

ముఖ్యంగా ఇది ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్రవాసుల ప్రయాణికులకు తీపికబురనే చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్రం మీదుగా వందేభారత్ ట్రైన్స్ నడుస్తున్న విషయం తెలిసింది. ఇప్పడు తాజాగా మరో రెండు వందేభారత్ ట్రైన్స్‌ను దేశప్రధాని నేడు ప్రారంభించనున్నారు.

నేటి నుంచి ఏపీ వాసులకు మూడు వందేభారత్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడుస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా, మంగళవారం అంటే నేడు ఇదే మార్గంలో మరో రైలు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు నేడు భువనేశ్వర్‌-విశాఖ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించననున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

రూ.85 వేల కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన : అంతేకాకుండా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ గుల్బర్గా- బెంగళూరు వందేభారత్ ట్రైన్ నేడు ప్రారంభం కానుంది. ఇక, ఈ వందేభారత్ ట్రైన్ అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, మంత్రాలయం స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగనుంది. వీటితోపాటు నేడు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయునున్నారు. అందులో కొళ్లం-తిరుపతి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలోని పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్‌ లైన్లు, పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, గూడ్స్‌ షెడ్లు వంటి వాటికి శంకుస్థాపన చేయనున్నారు.

 

దేశం మొత్తం మీద నేడు ప్రధాని రూ.85 వేల కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొమ్మిది పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్‌ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, మూడు రైల్వే కోచ్‌ రెస్టారెంట్లను ప్రధాని ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే, 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు ఆయన నేడు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించే సికింద్రాబాద్‌ – విశాఖ వందేభారత్‌ రైలు మార్చి 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ట్రైన్ ప్రతి గురువారం ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !