పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..

bahubalamtv Reporter
bahubalamtv.in

పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..

బాహు బలంన్యూస్ హుజరాబాద్, స్వేచ్ఛ: జూన్ 02:
హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే 'నవనిర్మాణ సభ'ను చూసి తెలంగాణలోని కొందరు నాయకులకు వణుకు పుడుతోందని ఆ పార్టీ జిల్లా నాయకుడు చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి విమర్శించారు. సోమవారం హుజరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జూన్ 2న జరిగే సభను చూసి ఓర్వలేక కొందరు నేతలు మళ్లీ 'ఆంధ్రా - తెలంగాణ' ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
రోడ్డు వేయడం చేతకాని మంత్రి.. పవన్‌కు నీతులు చెప్తారా?
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఉదయ భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "హుస్నాబాద్ ప్రజలు గెలిపించి రెండేళ్లవుతున్నా సైదాపూర్ మండలంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?" అని నిలదీశారు. వంగర నుంచి హుజూరాబాద్ రోడ్డు వేయలేని మంత్రి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న సుపరిపాలనను చూసి మంత్రి నేర్చుకోవాలని హితవు పలికారు. కరోనా, వరదల సమయంలో తెలంగాణకు పవన్ కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చినప్పుడు నోరు మెదపని వారు, ఇప్పుడు సభ పెడుతుంటే లొల్లి మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జనజాగృతి' నిధుల లెక్కలేవీ?: కవితకు ప్రశ్న
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై జనసేన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ జనజాగృతి పేరుతో విదేశాల నుంచి సేకరించిన కోట్ల రూపాయల నిధుల లెక్కలు ఏమయ్యాయి? పవన్ కళ్యాణ్ అడిగి 12 ఏళ్లవుతున్నా ఎందుకు బయటపెట్టడం లేదు?" అని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను అడ్డుకుని, చేనేత కార్మికులను, రైతులను ఆదుకున్నది పవన్ కళ్యాణేనని గుర్తుచేశారు.
అలాగే ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత పోలీసుల పేరుతో డ్రామాలు ఆడి చివరకు క్షమాపణలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ వాదం ముసుగులో పవన్ కళ్యాణ్‌పై అనుచిత విమర్శలు చేస్తే జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోవని వారు హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజరాబాద్, స్వేచ్ఛ: జూన్ 02:
హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే ‘నవనిర్మాణ సభ’ను చూసి తెలంగాణలోని కొందరు నాయకులకు వణుకు పుడుతోందని ఆ పార్టీ జిల్లా నాయకుడు చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి విమర్శించారు. సోమవారం హుజరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జూన్ 2న జరిగే సభను చూసి ఓర్వలేక కొందరు నేతలు మళ్లీ ‘ఆంధ్రా – తెలంగాణ’ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
రోడ్డు వేయడం చేతకాని మంత్రి.. పవన్‌కు నీతులు చెప్తారా?
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఉదయ భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “హుస్నాబాద్ ప్రజలు గెలిపించి రెండేళ్లవుతున్నా సైదాపూర్ మండలంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?” అని నిలదీశారు. వంగర నుంచి హుజూరాబాద్ రోడ్డు వేయలేని మంత్రి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న సుపరిపాలనను చూసి మంత్రి నేర్చుకోవాలని హితవు పలికారు. కరోనా, వరదల సమయంలో తెలంగాణకు పవన్ కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చినప్పుడు నోరు మెదపని వారు, ఇప్పుడు సభ పెడుతుంటే లొల్లి మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జనజాగృతి’ నిధుల లెక్కలేవీ?: కవితకు ప్రశ్న
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై జనసేన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ జనజాగృతి పేరుతో విదేశాల నుంచి సేకరించిన కోట్ల రూపాయల నిధుల లెక్కలు ఏమయ్యాయి? పవన్ కళ్యాణ్ అడిగి 12 ఏళ్లవుతున్నా ఎందుకు బయటపెట్టడం లేదు?” అని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను అడ్డుకుని, చేనేత కార్మికులను, రైతులను ఆదుకున్నది పవన్ కళ్యాణేనని గుర్తుచేశారు.
అలాగే ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత పోలీసుల పేరుతో డ్రామాలు ఆడి చివరకు క్షమాపణలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ వాదం ముసుగులో పవన్ కళ్యాణ్‌పై అనుచిత విమర్శలు చేస్తే జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోవని వారు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !